చిలుకూరు : ప్రతి ఇంటికీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఉండేలా చూడాలని జెడ్పీ సీఈఓ, కోదాడ నియోజకవర్గ ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయినేజీ, సోక్‌పిట్లు, బోర్‌వెల్ రీచార్జ్ తదితర ఉపాధి హామీ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ఆ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, ఏపీఓ నిర్మల, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తక్కువ నీటి వినియోగం
ఉన్న పంటలనే సాగు చేయాలి
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నందున, రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలనే సాగు చేయాలని జెడ్పీ సీఈఓ శిరీష అన్నారు. చిలుకూరులో జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ముక్కపాటి నరసింహారావు, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, చిలుకూరు జెడ్పీ పాఠశాల హెచ్‌ఎమ్ రాజారాం, గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఫ జెడ్పీ సీఈఓ శిరీష


