అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ సాధ్యం | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ సాధ్యం

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

సూర్యాపేట టౌన్‌ : అవగాహనతోనే ఎయిడ్స్‌ వ్యాధిని నివారించవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ రమావత్‌ సైదానాయక్‌ అన్నారు. శుక్రవారం డిస్టిక్‌ లెవెల్‌ వన్డే రెడ్‌ రిబ్బన్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరమన్నారు. వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం జరగాలని, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్‌ అంటువ్యాధి కాదని, వ్యాధిగ్రస్తులను సమాజంలో చులకనగా చూడవద్దన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మారం వెంకటరమణారెడ్డి, ప్రిన్సిపాల్‌ వి.వెంకటేషులు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌ఆర్‌ శాస్త్రి, ప్రోగ్రాం ఆఫీసర్లు మధుసూదన్‌, సృజన, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఫ ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌

రమావత్‌ సైదానాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement