ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్స్‌పాల్‌ ఎన్‌. వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 15వ తేదీలోగా www.iti.te langana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి విడతలో సీటు పొందని వారు కూడా రెండో విడతలో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8247506920, 8499084414, 9160284139, 8247443682 నంబర్లను సంప్రదించాలని కోరారు.

బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలి

నడిగూడెం : విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని బాగా చదివి ఉన్నత స్థానానికి చేరాలని జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి విశాల్‌ ధార పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కరివిరాలలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని మోడల్‌ స్కూల్‌ బాలురకు వసతి గృహానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి వంశీ, వార్డెన్‌ లతిమూన్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

డీఎస్‌సీడీఓగా కె.లత

భానుపురి (సూర్యాపేట) : జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న కె.లత డీఎస్‌సీడీఓ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ అధి కారిగా శుక్రవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, సాయికుమారా చార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement