హెపటైటిస్‌పై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

హెపటైటిస్‌పై అవగాహన అవసరం

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

సూర్యాపేటటౌన్‌ : హెపటైటిస్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హైపటైటిస్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరినగర్‌ ఆరోగ్య కేంద్రంలో హెపటైటిస్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్‌ సోకితే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. పుట్టిన 24 గంటల్లోగా హెపటైటిస్‌ టీకా ఇప్పించడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. ఆశా కార్యకర్త పుట్టిన పిల్లలకు టీకా ఇప్పించాలని, ఆరోగ్య కార్యకర్తలు విధిగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ ప్రసిద్ద్‌, డాక్టర్‌ నాజియా తబస్సుమ్‌, డాక్టర్‌ శ్రీశైలం, డాక్టర్‌ ప్రణీత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement