ప్రస్తుతం స్నేహితుల ముసుగులో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో స్నేహితులు, బంధువుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడుగుతూ మెసేజ్‌లు పంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని సూర్యాపేట సైబర్ క్రైమ్ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా ఆన్‌లైన్‌లో ఫ్రెడ్స్ పేరుతో జరుగుతున్న మోసాలపై ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సూర్యాపేటటౌన్ : ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులు స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని, ఆ తర్వాత బహుమతులు, పెట్టుబడులు, అత్యవసర అవసరాలు, ప్రేమ పేరుతో డబ్బులు అడిగి మోసం చేసే ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, యూపీఐ వివరాలు ఇవ్వకూడదు. అనుమానాస్పద లింకులు, యాప్‌లు డౌన్‌న్‌లోడ్ చేయడం, తెలియని ఖాతాలకు నగదు బదిలీ చేయడం ప్రమాదకరం. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్ పెట్టుకోవడం, టూ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌న్‌ను తప్పనిసరిగా వినియోగించాలి.
ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు
వెంటనే స్పందించొద్దు
సామాజిక మాధ్యమాల్లో స్నేహితులు, బంధువుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి తాను ఆపదలో ఉన్నానని, డబ్బులు కావాలని అడుగుతూ మెసేజ్‌లు పంపుతున్న ఘటనలు ఈమధ్య చోటు చేసుకుంటున్నాయి. పరిచయం ఉన్న వ్యక్తి పేరుతో మెసేజ్ వచ్చినా నమ్మి వెంటనే డబ్బులు పంపవద్దని, అతడి నంబర్‌కు ఫోన్ చేసి ముందుగా నిర్ధారించుకోవాలి.
1930కు ఫిర్యాదు చేయాలి
ఆన్‌లైన్‌లో, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌న్‌కు ఫోన్ చేయాలి, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. సమయానికి ఫిర్యాదు చేస్తే మోసగాళ్లు కాజేసిన డబ్బు అతను తీసుకోకుండా నిలిపివేసే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టవచ్చు.
ఫ సామాజిక మాధ్యమాల ద్వారా
డబ్బులు అడిగితే పంపొద్దు
ఫ ఆన్‌లైన్ మోసాలపై
అప్రమత్తంగా ఉండాలి
ఫ సైబర్ క్రైమ్ సీఐ లక్ష్మీనారాయణ


