ఫ శ్రీశైలంలో విద్యుదుత్పాదనతో 81,565 క్యూసెక్కుల నీరు విడుదల
నాగార్జునసాగర్ : సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడు అడుగుల మేర పెరిగింది. శ్రీశైలం జలాశయం విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయానికి 81,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద విద్యుదుత్పాదన చేస్తూ 31,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 900 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టిఎంసీలు)కాగా.. ప్రస్తుతం 516.50 అడుగులు (142.9715 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో త్వరలోనే శ్రీశైలం జలాశయం నుంచి రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా సాగర్ జలాశయంలోని నీటిని విడుదల చేస్తారని తెలంగాణ సాగునీటి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


