మునగాల : అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం ఆయన మునగాల మండల పరిధిలోని 65వ నబర్ జాతీయ రహదారిపై ఉన్న మునగాల పీహెచ్‌సీ, మాధవరం, మొద్దులచెరువు, తాడువాయి వద్ద ప్రమాదం జరిగే స్థలాల(బ్లాక్‌స్పాట్ల)ను పరిశీ లించారు. అలాగే గురువారం రాత్రి ముకుందాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృత్యువాత పడిన ఘటన స్థలాన్ని కూడా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక ఎస్‌ఐని ఆదేశించారు. బ్లాక్‌స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది, స్థానికులకు పలు సూచనలు చేశారు. మునగాల పీహెచ్‌సీ వద్ద బ్లాక్‌స్పాట్స్ పరిశీలనలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ మల్లు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, నాయకులు బచ్చు అశోక్, తక్కెళ్లపాటి సాయి, ముస్కుల సైదిరెడ్డి, నర్రా శ్రీపాల్‌రెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకుడు కోల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


