పీఆర్‌సీ రిపోర్టు ప్రకటించి అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ రిపోర్టు ప్రకటించి అమలు చేయాలి

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

సూర్యాపేటటౌన్‌ : పీఆర్‌సీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌ )రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం సూర్యాపేటలోని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ సంగం జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పీఆర్‌సీ నివేదికను వెంటనే ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను ప్రకటించడంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలన్నారు. జీవో నంబర్‌ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్‌ కార్డులను జారీ చేసి ఆసుపత్రుల లిస్టును ఫైనల్‌ చేసి వెంటనే చికిత్సను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.అనిల్‌కుమార్‌, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి.వెంకటయ్య, ఎన్‌.నాగేశ్వరరావు, వెలుగు రమేష్‌, చిలక రమేష్‌, డి.లాలు తదితరులు పాల్గొన్నారు.

ఫ టీఎస్‌ యూటీఎఫ్‌

రాష్ట్ర కార్యదర్శి సోమయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement