స్కూల్‌ ఫ్రెండ్స్‌ టచ్‌లో ఉన్నారు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ఫ్రెండ్స్‌ టచ్‌లో ఉన్నారు

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

స్కూల్‌ ఫ్రెండ్స్‌ టచ్‌లో ఉన్నారు

నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

నల్లగొండ : పాఠశాలలో ఎంతో మంది స్నేహితులు ఉన్నా, ఇద్దరు మాత్రమే ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారని.. స్కూల్‌లో ఆటపాటలతో పాటు చదువులోనూ ముందుండే వాళ్లమని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుల గురించి ఆయన మాటల్లోనే.. ‘నేను పుట్టి, పెరిగింది సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లి. అక్కడే మహేంద్ర హిల్స్‌లో ఆగ్జిలియం హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివాను. నాన్న బాలాజీ పవార్‌ డాక్టర్‌ కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. అమ్మ సుశీల, చెల్లి, నేను వెస్ట్‌మారేడుపల్లిలోనే ఉండేవాళ్లం. పదో తరగతి వరకు ఎంతో మంది స్నేహితులు ఉన్నా రఘు, శ్రీకాంత్‌ మాత్రం ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. ఎంతో అల్లరి చేస్తూ చదువుతో పాటు ఆటలు, పాటలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. నేను స్కూల్‌లో క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. అదే స్ఫూర్తితో ఐపీఎస్‌ అయ్యాను. అయినా మా దోస్తాన్‌ అలానే ఉంది. ఆనాటి రోజులు, చిన్ననాటి స్నేహితులను గుర్తుచేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.’

చిన్ననాటి స్నేహాలే స్వచ్ఛమైనవి

యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు

యాదగిరిగుట్ట రూరల్‌ : స్నేహం మనిషి జీవితంలో ఒక అపురూపమైన బంధం. ప్రతీ సంవత్సరం నేను, నా చిన్ననాటి మిత్రులను కలుస్తుంటాను. నాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను, సాదకబాధకాలను ఒకరినొకరు పంచుకుంటాం. చిన్నప్పటి స్నేహాలు మాత్రమే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రస్తుతం చాలామంది స్నేహాలు గఅవసరాల కోసం ఏర్పరుచుకుంటున్నారు. చిన్ననాటి స్నేహాలు కాలం మారినా, దూరం పెరిగినా జీవితాంతం తోడుంటాయి. కష్టకాలంలో ప్రేమను, ఆపదలో సహాయాన్ని అందించే స్నేహాలే గొప్పవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement