పెద్దవూర : చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ పేర్కొన్నారు. శనివారం ఆయన పెద్దవూర పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ జె. గోపాల్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దవూర మండలం బెట్టెలతండాకు చెందిన బొమ్ము మరియమ్మ ఇంటికి గత నెల 1వ తేదీ మధ్యాహ్నం ఏపీలోని పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన దండగల యేసురాజు, షేక్ మబు సుభాని, బత్తుల లోకేష్, పల్లె ఝెలియజారఱ్, సయ్యద్ నాగుల్‌బాషా రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. తమకు భోజనం వండి పెడితే డబ్బులు ఇస్తామని చెప్పి.. మరియమ్మతో భోజనం వండించుకుని తిన్నారు. ఆ సమయంలో బెట్టెలతండాకు చెందిన కరంసింగ్ అక్కడికి రాగా అతడితో మాటలు కలిపి ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు కరంసింగ్‌ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని సాగర్ వైపు తీసుకెళ్లారు. సమ్మక్క–సారలమ్మ జంక్షన్ వద్దకు వెళ్లగానే అతని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అక్కడి నుంచి తిరిగి మరియమ్మ ఇంటి వద్దకు వచ్చి ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్‌ను లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాహనాలు తనిఖీల్లో పట్టుబడి..
శనివారం మధ్యాహ్నం తుమ్మచెట్టు ఎక్స్ రోడ్డు వద్ద పెద్దవూర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఆ ఐదుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై సాగర్ నుంచి పెద్దవూర వైపు వెళ్తున్నారు. వారు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా వెంబడించి పట్టుకున్నారు. విచారణలో భాగంగా మరియమ్మకు చెందిన రోల్డ్ గోల్డ్ చైన్‌ను, కరంసింగ్‌కు చెందిన సెల్‌ఫోన్‌ను అపహరించినట్లు నేరం ఒప్పుకున్నారు. నిందితులందరూ జల్సాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నట్లు సీఐ శ్రీనునాయక్ తెలిపారు. గతంలో గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో లోకేష్, నాగూర్‌బాషా, సుభానీలపై దొంగతనం కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు ద్వి చక్రవాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఫ రెండు ద్విచక్ర వాహనాలు,
ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం


