స్నేహం.. దేవుడిచ్చిన వరం | - | Sakshi
Sakshi News home page

స్నేహం.. దేవుడిచ్చిన వరం

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

శాలిగౌరారం : మనిషి జీవితంలో దేవుడు ఇచ్చిన అత్యంత విలువైన వరాల్లో స్నేహం ఒకటని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం గురించి ఆయన మాటల్లోనే.. ‘బాల్యం నుంచి జీవిత ప్రయాణంలోని ప్రతీ దశలో మనతో పాటు నడిచే స్నేహితులు మనకు గొప్ప బలం. వారితో గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మనం ఎక్కడ ఉన్నా నిజమైన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. నిజమైన స్నేహం విశ్వాసం, నిజాయితీ, గౌరవం, పరస్పర సహకారంతో నిర్మించబడుతుంది. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా బాల్య స్నేహితులకు, స్కూల్‌ మిత్రులకు, వ్యక్తిగత మిత్రులకు, నా రాజకీయ ప్రయాణంలో నాతో కలిసినడుస్తున్న ప్రతీ మిత్రుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement