సూర్యాపేట : విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పెట్టొద్దని ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చందన ఫార్మసీ కళాశాలలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, సైబర్ జాగ్రక్త దివస్ అవగాహన సదస్సులో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెలంతా ప్రజలను, యువతను సైబర్ నేరాలపై చైతన్య పరుస్తామన్నారు. ప్రతి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘సైబర్ జాగృక్త దివస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు విషయాలపై విద్యార్థులకు పోలీస్ కళాబృందం పాటల ద్వారా అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మినారాయణ, రూరల్ ఎస్‌ఐ అనిల్, షీ టీం ఎస్‌ఐ నీలిమ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది, రూరల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
విద్య, విజ్ఞానం కోసమే
ఇంటర్నెట్‌ను ఉపయోగించాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు ఇంటర్నేట్‌ను విద్య, విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, సైబర్ జాగ్రక్త దివస్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలు, వాటి నివారణ పట్ల సూర్యాపేట పట్టణ పోలీస్, సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. ఈ సదస్సులో పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు సందీప్, యాదవేందర్‌రెడ్డి, షీటీమ్ ఎస్‌ఐ నీలిమ, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాలరాజు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


