ఆరుతడి పంటల సాగే మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటల సాగే మేలు

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

చివ్వెంల(సూర్యాపేట) : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగు చేయడమే మేలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) జి.శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో కూరగాయల పంటల సాగును పరిశీలించి మాట్లాడారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని, వరిసాగును తగ్గించి ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, చిరుధాన్యాలు, కూరగాయలను పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పంటల సాగు విధానంలో వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవస అధికారి నాగయ్య, తహసీల్దార్‌ జి.చంద్రశేఖర్‌, వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు, ఏఈఓలు మానస. శైలజ, సరిత, ఆర్‌ఐ శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలి

సూర్యాపేటటౌన్‌ : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23న లక్ష మందితో హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్‌కుమార్‌, జిల్లా కోశాధికారి గుయ్యని ప్రసాద్‌లు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ డీప్యూటీ సీఈఓ మహాలక్ష్మితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుకు జరిగే చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ పర్యవేక్షకులు నరేందర్‌ రెడ్డి, కృష్ణమోహన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పద్మనాభం, వలియాద్‌ బేగం, హాసన్‌ అలీ, మమత, దశరథ, నాగేశ్వరావు, జూనియర్‌ అసిస్టెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఎన్జీ కళాశాలలో నేడు

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలో తెలంగాణ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఫార్మా, కెమికల్‌ తయారీ సంస్థ వియాష్‌ సైంటిఫిక్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో గురువారం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఉపేందర్‌, టీఎస్కేసీ కోఆర్డినేటర్‌ ఎం.అనిల్‌కుమార్‌ తెలిపారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్జీ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు.

మట్టపల్లిలో విశేష పూజలు

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం వేద మంత్రాల నడుమ అర్చకులు నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా మహానివేదన గావించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఆలయ ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement