కోదాడరూరల్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం కోదాడ మండలంలోని అల్వాలపురం రైతు వేదికలో నిర్వహించిన మండల సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను రైతులకు వివరించి వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరుతడి పంటల విత్తనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమబాబు, వైస్ చైర్‌పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఎంపీడీఓ ఇసాక్‌హుస్సేన్, తహసీల్దార్ సంతోష్‌కిరణ్, ఏఓ పాలెం రజిని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అలసకాని శరభేశ్వరరావు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
రైతులతో మాట్లాడిన మంత్రి, కలెక్టర్
నడిగూడెం : రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నడిగూడెం రైతు వేదికలో ఉన్న పలువురు రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ రైతునేస్తం ద్వారా వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ, మండల ప్రత్యేకాధికారి దామోదర్‌రెడ్డి, ఏడీఏలు జ్ఞానేశ్వరి దేవి, ప్రశాంతి, తహసీల్దార్ మంగ, ఎంపీడీఓ మల్సూర్, ఏఓ మల్సూర్, సర్పంచ్‌లు రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


