పెన్‌పహాడ్ : జాతీయ ఆరోగ్య కార్యక్రమాల విజయవంతానికి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు బాధ్యతగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ పి.వెంకటరమణ అన్నారు. మంగళవారం పెన్‌పహాడ్‌లోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ఫలాలు గ్రామీణ స్థాయిలో ప్రతి ఇంటికీ అందేలా కృషిచేయాలన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు అన్ని టీకాలు వంద శాతం పూర్తి చేయడంతో పాటు అర్హులందరికీ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నారు. క్షయవ్యాధి అనుమానితులతోపాటు 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎనన్‌సీడీ స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో డెంగీ, ఫైలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి రాజేష్, పద్మ, ఆరోగ్య విస్తరణ అధికారులు తాడూరి వెంకన్న, ప్రభాకర్, సూపర్వైజర్ పూలమ్మ, ఎంఎల్‌హెచ్‌పీలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ వెంకటరమణ


