హైదరాబాద్ చైన్నె హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ముందు ప్రకటించినట్లుగానే నేషనల్ హైవే 65 వెంటే మార్గాన్ని నిర్మించాలి. భూ సేకరణ కూడా తక్కువగా ఉండటం వల్ల ఖర్చు తగ్గుతుంది. సూర్యాపేటను కాదని బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– ఆరుట్ల జానకిరెడ్డి,
బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్
హైస్పీడ్ ట్రైన్ అలైన్మెంట్‌ను ఇంతకుముందు ఉన్నట్లుగానే కొనసాగించాలి. సూర్యాపేటకు రైల్వే లైను తీసుకురావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని విస్మరించడం మంచిది కాదు. జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం
– డేగల జనార్దన్, రైల్వే సాధన సమితి కన్వీనర్


