కరెంట్‌ కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

పాలకవీడు : ఒక్కసారి రైతుకు కష్టం వస్తే ఆదుకోలేరా అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్‌నిన్‌ ప్రభావాన్ని సాకుగా చూపిస్తూ కరెంటు కోతలు విధిస్తున్నారంటూ బుధవారం పాలకవీడు సబ్‌స్టేషన్‌ వద్ద బీఆర్‌స్‌ నాయకులు రైతులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించాలరని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం 10 గంటల కరెంటు సరఫరా చేయలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారని, కోతల వల్ల విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. కోతలు లేకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్‌ఎస్‌ నాయకులు పెరుమాల్ల సతీష్‌, మంద నాగయ్య, యరడ్ల గణపతిరెడ్డి, హరినాయక్‌, సైదిరెడ్డి, కొండలు, బాలరాజు, వీరబాబు, కోటేశ్వరరావు, వెంకన్న, నరేష్‌, మధు, అఖిల్‌రెడ్డి, రవి, మరియదాసు, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement