● మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష నేతల విజ్ఞప్తి
సూర్యాపేట : సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొదటి అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష నేతలు కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ కోదండరామ్‌కు వినతి పత్రాలు అందజేశారు. మొదట ప్రకటించిన ప్రకారం శంషాబాద్ వయా సూర్యాపేట మీదుగా రైల్వేలైన్ నిర్మించాలన్నారు. కార్యక్రమంలో బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షాల కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, రమణాచారి, అఖిలపక్షాల నేతలు పెద్దిరెడ్డి రాజా, తండు శ్రీనివాస్ యాదవ్, అనుములపురి రవిబాబు, డాక్టర్ రామ్మూర్తి, చల్లమల్ల నరసింహ, పాండురంగాచారి, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్‌రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు, కునుకుంట్ల సైదులు, గంట నాగయ్య ఆనంతుల మధు, సట్టు నాగయ్య, నాగరాజు, రమేష్ పాల్గొన్నారు.


