సూర్యాపేట టౌన్ : రాష్ట్రంలో ఇప్పుడున్నది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. గోదావరి నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ సూర్యాపేట జిల్లాకు సాగునీరు అందడం లేదన్నారు. కాళేశ్వరం, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి జిల్లాకు నీటిని అందించే వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో వరుసగా అన్ని పంటలకు నీరు అందించామని, ప్రస్తుతం ఒక్క పంటకై నా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా తీవ్రంగా దెబ్బతిందని, రైతులకు రోజుకు 12 నుంచి 13 గంటల పాటు కూడా నాణ్యమైన విద్యుత్ అందడం లేదన్నారు. సాగునీటి కొరతతో రైతులు మళ్లీ బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని, అప్పులు చేసి బోర్లు వేసుకున్నా కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకే ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చొద్దు
శంషాబాద్–నల్లగొండ–సూర్యాపేట మీదుగా చైన్నె వరకు ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అలైన్‌న్ మెంట్‌ను మార్చవద్దని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కోరారు. గతంలో ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం శంషాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట మీదుగా చైన్నె వరకు బుల్లెట్ ట్రైన్ రూట్ ఉంటుందని ప్రజలు విశ్వసించారన్నారు. ఇప్పుడు అలైన్‌మెంట్‌ను మార్చి మరో మార్గాన్ని పరిశీలిస్తున్నారనే వార్తలతో ఉమ్మడి జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి


