చిలుకూరు : హుజూర్‌నగర్ పట్టణంలో ఈ నెల 27 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన పిలుపునిచ్చారు. శనివారం చిలుకూరు మండలం నారాయణపురంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ల కోసం జాతీయ మహిళా సమాఖ్య అనేక సంవత్సరాల నుంచి పోరాడుతుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రెమిడాల జయసుధ, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కోటమ్మ, దేవరం మల్లీశ్వరి, ఐలాపురం లక్ష్మి, అలివేలు సర్పంచ్‌లు మండవ జయమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు.


