సూర్యాపేటటౌన్ : పర్యావరణ పరిక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవం సందర్భంగా ఎస్పీ నరసింహతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లు, అడవులు పెంచడం వల్ల పర్యావరణ రక్షణకు, సమృద్ధిగా వర్షాలు కురవడానికి ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వనమహోత్సవం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మంజు భార్గవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రవి, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
భానుపురి (సూర్యాపేట) : వైద్యులు బాధ్యతతో విధులు నిర్వహిస్తూ సమయపాలన పాటించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో ఆర్‌ఎంఓ డాక్టర్ ఉపేందర్‌తో కలిసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీడీఎస్. ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, ఆర్‌ఎంఓలతో నిర్వహించిన వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. పైథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల అభివృద్ధి, అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్‌ఎంఓ జి.ఉపేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


