నేరేడుచర్ల : నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాన్పు కోసం వచ్చే వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని లెప్రసీ, టీబీ వాధ్యుల నివారణ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ప్రసిద్ధ్ అన్నారు. బుధవారం ఆయన నేరేడుచర్ల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. గదులు, రికార్డులను పరిశీలించి రోగులను వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవం చేసిన మండల వైద్యాధికారిని పున్నా నాగిని, సిబ్బందిని అభినందించారు. వారి వెంట సీహెచ్‌ఓ సల్వాది శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఏఎన్‌ఎం సునిత ఉన్నారు.


