అర్జీలను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 117 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ సన్యాసయ్య, సీపీఓ కిషన్‌, డీఈఓ అశోక్‌, డీపీఓ యాదగిరి, అధికారులు పాల్గొన్నారు.

10 వరకు ఎన్యూమరేషన్‌ పూర్తిచేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందున బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణను ఈనెల 10 నాటికి వంద శాతం పూర్తిచేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ స్పష్టం చేశారు. సోమవారంసూర్యాపేట కలెక్టరేట్‌ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు వెంటనే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి సర్‌కు సహకరించేలా అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఎన్నికల విభాగం నుంచి రాజేందర్‌రెడ్డి, భరత్‌, రణధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement