5న బహిరంగ వేలం | - | Sakshi
Sakshi News home page

5న బహిరంగ వేలం

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

సూర్యాపేటటౌన్‌ : జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గల పాత పోలీసు కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు పోలీసు వాహనాల పాత బ్యాటరీలు, టైర్లు ఇతర పాత సామగ్రికి ఈ నెల 5న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సాహవంతులైన వ్యాపారులు నేరుగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు ఆర్‌ఎస్‌ఐ సురేష్‌ సెల్‌ 8712686019 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

మట్టి నమూనాలపై

అవగాహన అవసరం

గరిడేపల్లి : మట్టి నమూనాలపై రైతులకు అవగాహన అవసరమని హైదరాబాద్‌ కు చెందిన చైతన్య టీం టు బి యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ విద్యార్థులు అన్నారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గరిడేపల్లి మండల కేంద్రంలో రైతులకు మట్టి నమూనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి, లహరి, వినీల, సీజ, జబీన్‌, అభివర్షరెడ్డి, శరణ్య, పలువురు, రైతులుపాల్గొన్నారు.

శివయ్యకు పుష్పార్చన

మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పుష్పార్చన చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, గోపూజలు చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్దన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.

శివగంగా లిప్టు ద్వారా సాగు నీరు విడుదల

మేళ్లచెరువు : చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద కృష్ణానదిపై ఉన్న శివగంగా లిప్టు నుంచి సోమవారం సాగు నీటిని విడుదల చేశారు. లిప్టు చైర్మన్‌ గుడిసె వెంకట్‌రెడ్డి నీటి విడుదల కోసం స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వానలు లేక రైతులు అరకొర వేసిన మెట్టపంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో సాగునీటిని విడుదల చేశామన్నారు. దీంతో లిఫ్టు ఆయకట్టులోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు, ఎదుర్కోలు మహోత్సవం చేపట్టా రు. కల్యాణం నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు అన్నదానం చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement