ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చిన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన నాయిని హనుమంతు అనే వృద్ధుడిని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆప్యాయంగా భుజం మీద చేయివేసి పలకరించి అతడి సమస్యను తెలుసుకున్నారు. దీంతో వృద్ధుడు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని తన పొలానికి వెళ్లేందుకు బాట లేదని, బాట సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి బాట సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్


