సమ్మె కాలం వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మె కాలం వేతనం చెల్లించాలి

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

సూర్యాపేటటౌన్‌ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గతంలో విధులకు ఆటంకం కలగకుండా సమ్మె చేసిన కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలం వేతనం వెంటనే చెల్లించాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట మండలంలోని గురుకుల, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్య త్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇమాంపేట కేజీబీవీలో లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. గురుకుల, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ ఉపాధ్యాయులు అనేక సమస్యలు, పని ఒత్తిడితో సతమతం అవుతున్నా ప్రభుత్వ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాస్టల్‌ వార్డెన్స్‌, కేర్‌ టేకర్స్‌ను వెంటనే నియమించాలన్నారు. అందరికీ కూడా హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు. 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రామ్‌సింగ్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నాగన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement