సూర్యాపేట : ప్రజల సహకారం, ఐక్య ఉద్యమాలతోనే రైల్వేలైన్ సాధన సాధ్యమవుతుందని సూర్యాపేట రైల్వేలైన్ సాధన సమితి ప్రతినిధులు అన్నారు. సోమవారం సూర్యాపేటలోని ఆ సమితి కార్యాలయంలో రైల్వే సాధన సమితి ఉద్యమ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాకు రైల్వే మార్గం అత్యవసరమని, ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కోకన్వీనర్లు డాక్టర్ ఆదుర్తి రమేష్ చంద్ర, రాచూరి ప్రతాప్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.రంగారెడ్డి, గౌరవ సలహాదారులు న్యాయవాది అయోధ్య, లింగంపల్లి భద్రయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ వి.రామ్మూర్తి, న్యాయవాదులు నూకల సుదర్శన్ రెడ్డి, తల్లమల్ల హసేన్ తదితరులు పాల్గొన్నారు.


