అర్వపల్లి: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారి (365బీ)పై జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వచ్చే వాహన దారులు గుంతను గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోక పోవడంతో స్థానికులు గుంతపై కంపవేసి చుట్టూ రాళ్లు పెట్టారు. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.
365 జాతీయ రహదారిపై రోడ్డు మధ్య
ప్రమాదకరంగా ఉన్న గుంత


