120 సెకన్ల నిరీక్షణ.. 30 సెకన్ల ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

120 సెకన్ల నిరీక్షణ.. 30 సెకన్ల ప్రయాణం

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్‌ నివారణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌ టైమింగ్‌లో సరైన ప్రణాళిక లేక వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. కొత్త బస్టాండ్‌, ఖమ్మం క్రాస్‌ రోడ్‌ ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్‌లు లేకపోవడం, ప్రైవేట్‌ వాహనాల అక్రమ పార్కింగ్‌, ఆటోల విచ్చలవిడి రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

టైమింగ్స్‌ తప్పులతడక..

ప్రస్తుత సిగ్నల్‌ విధానంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్‌ సిగ్నల్‌ పడగానే సుమారు 2 నిమిషాలు వాహనాలను ఆపుతుండగా, గ్రీన్‌ సిగ్నల్‌ పడినప్పుడు మాత్రం కేవలం 30 సెకండ్లు మాత్రమే సమయం ఇస్తున్నారు. దీంతో ముందున్న వాహనాలు కదిలేసరికి సమయం అయిపోవడంతో, వెనుక ఉన్నవారు మరోసారి ఆగాల్సి వస్తోంది. ఫలితంగా సిగ్నల్స్‌ పెట్టినప్పటికీ ట్రాఫిక్‌ తగ్గకపోగా మరింత పెరుగుతోందని వాపోతున్నారు. ముఖ్యంగా ఎంజీ రోడ్‌ నుంచి హైదరాబాద్‌, విజయవాడ వైపు వెళ్లే మార్గాల్లో శ్రీఫ్రీ లెఫ్ట్‌శ్రీ సౌకర్యం లేకపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయని పేర్కొంటున్నారు.

స్పందించాలని విజ్ఞప్తి

పట్టణ ప్రజల సౌకర్యమే లక్ష్యంగా ట్రాఫిక్‌ నిర్వహణ ఉండాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం, మున్సిపల్‌ అధికారులు స్పందించి.. సిగ్నళ్ల వద్ద అన్ని వైపులా ఫ్రీ లెఫ్ట్‌లను ఏర్పాటు చేయాలని, అక్రమ పార్కింగ్‌లు, నిబంధనలు ఉల్లఘించే ఆటోలు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సూర్యాపేటలో ట్రాఫిక్‌ అవస్థలు

ఫ రెడ్‌, గ్రీన్‌ సిగ్నల్‌

టైమింగ్స్‌లో అసమతుల్యత

ఫ ఫ్రీ లెఫ్ట్‌ల కొరత, అక్రమ

పార్కింగ్‌తో ఇబ్బందులు

రద్దీతో ఉక్కిరిబిక్కిరి..

కొత్త బస్టాండ్‌ నుంచి ఖమ్మం, నల్లగొండ, హన్మకొండ, వరంగల్‌తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు జంక్షన్ల వద్ద రద్దీని మరింత పెంచుతున్నాయి. ఇక బస్టాండ్‌ ప్రధాన ద్వారం వద్దే ఆటోలను అడ్డగోలుగా నిలిపివేయడంతో బస్సులు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. మరోవైపు హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించడం, దింపడం వల్ల ఫ్రీ లెఫ్ట్‌లు ఉన్నా వాహనాలు ముందుకు కదలని దుస్థితి నెలకొంది. ఇక.. సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు నిలిచిపోవడంతో వర్షం వస్తే ద్విచక్ర వాహనదారులు పూర్తిగా తడిసిముద్దవుతున్నారు. ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్న పిల్లలు, వృద్ధులు వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement