జలసిరిపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

జలసిరిపై అవగాహన కల్పించాలి

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

నేరేడుచర్ల : జలసిరిపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని, ఎలోనిన్‌ ప్రభావంతో వర్షాలు కురువనందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నయ పంటలు సాగు చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్‌రావు సూచించారు. మంగళవారం నేరేడుచర్లలో వీబీజీరామ్‌జీ, జలసిరి కార్యక్రమంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతులు పంటల మార్పిడితో పాటు అంతర పంటలను సాగు చేయాలన్నారు. యాసంగిలో 3.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సైదులు, ఎంపీఓ నాగరాజు, మండల వ్యవసాయ అధికారి జావిద్‌, మండల వైద్యాధికారి పున్నా నాగిని, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసరఫరాలశాఖ

అధికారి మోహన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement