సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

Aug 5 2026 9:39 AM | Updated on Aug 5 2026 9:39 AM

కోదాడ : తెలంగాణ సాధనలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూలై నెలతో కలిపి ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం కట్‌ చేస్తున్నా వారికి సరైన వైద్యసేవలందడం లేదన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కుక్కడపు బాబు, చీమ నరేష్‌, ఎస్‌కె.నయీం, గట్ల కోటేశ్వరరావు, చలిగంటి వెంకట్‌ పాల్గొన్నారు.

వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం కోదాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం 12 గంటల కరెంట్‌ కూడా అందించలేకపోతుందని విమర్శించారు. అనంతరం వివిధ డిమాడ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎస్‌కె.నయీం, కుక్కడపు బాబు, గట్ల కోటేశ్వరరావు, తుమ్మలపల్లి భాస్కర్‌, నర్సిరెడ్డి, అలువాల వెంకట్‌, సంగిశెట్టి గోపాల్‌, చలిగంటి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement