మేళ్లచెరువు : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది కవాతు, వారి యూనిఫాం, పరికరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు నవీన్‌కుమార్, మోహన్, రాంబాబు, సిబ్బంది ఉన్నారు.
ఇంకుడు గుంతలతో
జల సంరక్షణ
పెన్‌పహాడ్ : ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా జలసంరక్షణలో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ‘జలసిరి’ కార్యక్రమంపై ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి సంరక్షణపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్‌లను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ జానయ్య, ఎంపీఓ రాజేశ్వర్, ఏపీఓ రవి, ఏఓ అనిల్‌కుమార్, మండల వైద్యాధికారి రాజేష్, పీఏసీఎస్ చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
ధ్రువపత్రాల పరిశీలన
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఖాళీగా ఉన్న 67 అంగన్‌వాడీ టీచర్లు, 64 హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.నరసింహరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఆగస్టు 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారంతా ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెండు సెట్ల జిరాక్స్‌లతో హాజరు కావాలని కోరారు.
లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: Ð]l$rtç³-ÍÏ ÌSMîS-ÿ¯]l-Æý‡-íÜ…çßæ-ÝëÓ-Ñ$ BÌS-Ķæ$…-ÌZ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÝëÓÑ$ÐéÇ °™èlÅ-MýS-ÌêÅ-×ê°² AÆý‡a-MýS$-Ë$ OÐðl¿ýæ-Ð]l…-V> °Æý‡Ó-íßæ…^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BÌS-Ķæ$…-ÌZ ÝëÓÑ$ÐéÇ Ð]lÊÌS-ÑÆ>sŒæMýS$ ç³…^éÐ]l$–-™éÀ-õÙMýS… ^ólÔ>Æý‡$. MýSÌêÅ-׿ Ðólyýl$-MýS-ÌZ ¿êVýS…-V> ÑÔèæÓ-MóSÞ-¯éÆ>«§ýl¯]l, ç³#׿Åçßæ-Ð]l-^èl¯]l…, Æý‡„>-º…«§ýl¯]l…, Æý‡$†ÓVýSÓ-Æý‡×æ…, Ð]l$«§ýl$-çœÆý‡P-ç³Nf, Ð]l*…VýS-ÌS-Å«§é-Æý‡-׿, ™èlÌS…{»ê-ÌS-™ø OÐðl¿ýæ-Ð]l…-V> °Æý‡Ó-íßæ…^éÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ BÌSĶæ$ A¯]l$-Ð]l…-ÕMýS «§ýlÆý‡Ã-MýS-Æý‡¢-Ë$, DK, AÆý‡a-MýS$-Ë$, ¿ýæMýS$¢-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.˘
మహిళా సమాఖ్య
జిల్లా కార్యవర్గం ఎన్నిక
హుజూర్‌నగర్ : జాతీయ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా కమిటీని హుజూర్‌నగర్‌లో జరిగిన మహాసభలో ఎన్నుకున్నట్లు సంఘం బాధ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా ఉప్పతల కోటమ్మ, ప్రధాన కార్యరద్శిగా దేవరం మల్లీశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఐలాపురం లక్ష్మీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. వారిని పలువురు నాయకులు వారిని ఘనంగా సన్మానించారు.
ఉప్పతల కోటమ్మ
దేవరం మల్లీశ్వరి


