భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంజనాపూరి కాలనీ వద్ద జాతీయ రహదారి–65పై అఖిలపక్షం, ప్రజా సంఘాలు, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతి పాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చినప్పటికీ, మూడో అలైన్‌మెంట్‌లో తొలగించడం సరికాదన్నారు. దీని వల్ల సూర్యాపేట జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాకు రైలు మార్గం కోసం 20 సంవత్సరాలుగా పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పెద్దిరెడ్డి రాజా, తండు శ్రీనివాస్ యాదవ్, ఊర రామ్మూర్తి యాదవ్, చల్లమల్ల నరసింహ, మల్లు నాగార్జునరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, బూర వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శివకుమార్, గంట నాగయ్య, షేక్ నజీర్, సతీష్, వల్లోజు ప్రశాంత్, రమణాచారి, నెమ్మాది వెంకటేశ్వర్లు, సైదులు, గోపి, తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో


