సూర్యాపేటటౌన్ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా సూర్యాపేట జిల్లాలో 127 మంది బాల, బాలికలను వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఎక్కువ మంది పిల్లలకు విముక్తి కల్పించేందుకు కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నెలరోజుల పాటు పోలీసులతో పాటు సంక్షేమ, బాలల పరిరక్షణ, లేబర్, రెవెన్యూ, హెల్త్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరాదరణకు గురైన వెట్టిలో మగ్గుతున్న బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించినట్లు చెప్పారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 56 మంది, ఉండగా అందులో 52 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 71 మందిలో 65 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఇన్‌స్పెక్టర్ మగ్దూం అలీ, మహిళా ఎస్‌ఐలు మౌనిక, నీలిమ, చైల్డ్ కేర్ అధి కారులు శ్రీలక్ష్మీ, ఉమామహేశ్వరి, నాగుల్‌మీరా, నాగరాజు, వంశీ, విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఒత్తిడి లేకుండా పని చేయాలి
పోలీసులు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పని చేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది క్రమశిక్షణతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు రవి, ప్రసన్నకుమార్, నరసింహాచారి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జానయ్య, సీఐలు పాల్గొన్నారు.
ఫ ముగిసిన ఆపరేషన్ ముస్కాన్
ఫఎస్పీ నరసింహ


