బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

భవిష్యత్‌ శాస్త్రవేత్తలుగా

ఎదిగేందుకు దోహదం

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌తో విద్యార్థుల్లో శాస్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలు, సృజనాత్మకత, పర్యావరణంపై బాధ్యత, సామాజిక సమస్యల పరిష్కారం సామర్థ్యం పెంపొందుతాయి. భవిష్యత్‌ శాస్త్రవేత్తలుగా ఎదగడానికి విద్యార్థులకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది. జిల్లాలోని అన్ని యాజమాన్య విద్యా సంస్థల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తమ విద్యార్థులు పాల్గొనేలా చూడాలి.

– ఎల్‌.దేవరాజ్‌, జిల్లా సైన్స్‌ అధికారి

సూర్యాపేటటౌన్‌ : విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానం, పరిశోధనా దృక్పథం, సమస్యను స్వయంగా పరిష్కరించుకునే నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ శాస్త్ర, సాంకేతిక శాఖ సహకారంతో రాష్ట్ర సాంకేతిక మండలి, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాలు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులను ఈ పోటీల్లో భాగస్వాములు చేస్తున్నారు. వినూత్న ప్రయోగాలను రూపొందించేందుకు ఈ సైన్స్‌ కాంగ్రెస్‌ దోహపదపడనుంది. రెండు సంవత్సరాల తర్వాత సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు.

విజ్ఞాన ఆవిష్కరణలే ప్రధాన అంశం

ఈ విద్యా సంవత్సరం నిర్వహించే బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ‘సుస్థిర అభివృద్ధి కోసం విజ్ఞాన ఆవిష్కరణలు’ అనే అంశం ఆధారంగా ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఉపఅంశాలను పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది.

● వ్యర్థాలను తగ్గించడం, పుర్వినియోగించడం, తిరిగి పొందడం.

● శక్తిని అన్వేశించడం, ప్రయోగించడం, మెరుగు పర్చడం, పరిణామం చెందడం.

● నీటి సేకరణ, సద్వినియోగం, రీ– సైక్లింగ్‌, సంరక్షణ

● ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం

● సుస్థిర కోసం జాతీయ జ్ఞాన వ్యవస్థల అనువర్తనం

ఒక్కో ప్రాజెక్టుకు ఇద్దరు

సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ప్రాజెక్టుకు ఇద్దరు విద్యార్థులు, ఒక గైడ్‌ టీచర్‌ పర్యవేక్షణలో పని చేయాలి. శాసీ్త్రయ పద్ధతి ప్రాజెక్టులు కేవలం ప్రదర్శన నమూనాలకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలపై సర్వేలు, ప్రయోగాలు, కేస్‌ స్టడీలు, ప్రశ్నావళి, డేటా విశ్లేషణ ఆధారంగా రూపొందించాలి. విద్యార్థులు స్వయంగా పరిశోధనలు చేసి ప్రాజెక్టు నివేదిక, లాగ్‌బుక్‌, ప్రదర్శన సామాగ్రిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ముందస్తుగా రిజిస్ట్రేషన్‌

విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ వరకు అధికారిక వెబ్‌ సైట్‌ ఎన్‌సీఎస్‌ఈ.ఇన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. విద్యార్థులు పాల్గొనేలా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలు సెప్టెంబర్‌ రెండో వారంలో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన ప్రాజెక్టును రాష్ట్ర స్థాయికి, అక్కడ ఉత్తమంగా ఎంపికై తే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయి, డిసెంబర్‌లో జాతీయ స్థాయి పోటీలు ఉండనున్నాయి.

జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు దరఖాస్తులు

ఫ ఆగస్టు 15 వరకు రిజిస్ట్రేషన్‌ గడువు

ఫ సెప్టెంబర్‌ రెండో వారంలో

నిర్వహణకు ఏర్పాట్లు

ఫ 6 నుంచి 10వ తరగతి

విద్యార్థులకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement