సూర్యాపేట : హైదరాబాద్ – చైన్నె బుల్లెట్ ట్రైన్‌న్ కారిడార్ పాత అలైన్‌మెంట్ కొనసాగించి, సూర్యాపేటలో స్టేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతూ బుల్లెట్ ట్రైన్‌న్ సాధన సమితి, అఖిలపక్ష నాయకులు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం అందించారు. ఆయన కోదాడకు వచ్చినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి మరీ విన్నవించారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్‌న్ వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని వారు కోరారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వినతిపత్రం అందించిన వారిలో బుల్లెట్ ట్రైన్‌న్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు మట్టిపెల్లి సైదులు, పేర్ల నాగయ్య, మిట్ట గనుపుల ముత్యాలు, జర్నలిస్టులు ఉన్నారు.


