చేనేత వృత్తిని కాపాడేందుకు చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

చేనేత వృత్తిని కాపాడేందుకు చొరవ చూపాలి

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

సూర్యాపేట : చేనేత వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గండూరి రమేష్‌ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ప్రస్తుతం చేనేత వృత్తి కనుమరుగయ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట పారిశ్రామిక సహకార సంఘం భవనంలో చేనేత పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తికి ఎంతో చరిత్ర ఉందన్నారు. 1905 ఆగస్టు 07న ఎందరో మహానుభావులు విదేశీ వస్త్రాలను బహిష్కరించారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 07న అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కడారి భిక్షం, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ విపూరి సుదర్శన్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ మిర్యాల గోపాలకిషన్‌, కౌన్సిలర్‌ నాగుల వాసు, టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దూలం నగేష్‌, మాజీ ఎంపీటీసీ పున్నం వెంకటేశ్వర్లు, సంఘం ఉపాధ్యక్షుడు చిలివేరు నరసింహారావు, కార్యదర్శి భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముశం హరి ప్రసాద్‌, డైరెక్టర్లు, మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిట్టకోల సతీష్‌ కుమార్‌, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ సహకార సంఘం అధ్యక్షుడు రమేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement