భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట నియోజకవర్గంలో అర్హులెవరూ ఓటు హక్కును కోల్పోవద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మిగిలిపోయిన అర్హులైన ఓటర్లు ఉంటే వారిని గుర్తించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఏబీ శ్రీనివాస్, శ్రీనివాస్, పీసీసీ కో ఆర్డినేటర్ అన్సారీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ప్రజల ఓటుహక్కు కోల్పోకుండా పనిచేశారు
హుజూర్‌నగర్ : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రజల ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ బీఎల్‌ఏలు పనిచేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై బీఎల్‌ఏలు, సూపర్ వైజర్లతో గురువారం హుజూర్‌నగర్‌లోని మంత్రి ఉత్తమ్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో ఇప్పటి వరకు 90.5.7 శాతం, కోదాడలో 90 శాతం ఎస్‌ఐఆర్ పూర్తయిందన్నారు. సమావేశంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, నల్గొండ పార్లమెంట్ ఎస్‌ఆర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, కోదాడ నియోజక వర్గ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ అన్సారి, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఈఆర్‌ఓ చిలక కిషోర్ పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్


