సూర్యాపేట : సూర్యాపేటకు రైలు మార్గం సాధించేంత వరకు సాగే ఉద్యమానికి తాను నాయకత్వం వహిస్తానని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటకు రైల్వే లైన్ సాధించాలనే ప్రజల చిరకాల ఆకాంక్షతో శుక్రవారం స్థానిక వాణిజ్య భవన్ చౌరస్తాలో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, తమ సంతకాల ద్వారా ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో రైల్వే విస్తరణ చాలా తక్కువగా జరిగిందని, ఆ లోటును భర్తీ చేయడంలో సూర్యాపేట రైల్వే లైన్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఊర రామ్మూర్తి, రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కే.రంగారెడ్డి, గౌరవ సలహాదారులు లింగంపల్లి భద్రయ్య, బత్తుల వెంకన్న, యాతాకుల రాజన్న, మహంకాళి సోమయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పుట్ట కిశోర్, ఆకుల లవకుశ, చింతలపాటి చిన్న శ్రీరాములు, చామల అశోక్‌కుమార్, భయ్యా మల్లికార్జున్, బొమ్మగాని శ్రీనివాస్, రాచూరి ప్రతాప్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, కార్యదర్శి తలమల్ల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి
ఫ జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్
చౌరస్తాలో సంతకాల సేకరణ


