భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. సోమవారం 98 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ ఐపాస్, టీ–ప్రైడ్ పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. జీఎం ఇండస్ట్రీస్ భారతి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


