రైతులకు చేయూతనందించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు చేయూతనందించాలి

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

ఆత్మకూర్‌ (ఎస్‌): గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధికి రైతులకు విద్యావంతులు, మేధావులు, అనుభవజ్ఞులు ప్రోత్సాహిస్తూ చేయూనందించాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు భూమి సునీల్‌ అన్నారు. ఏరువాక –రైతు బిడ్డల పొలం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు (ఎస్‌) మండలం మంగలితండాలో నిర్వహించి సదస్సులో ఆయన మాట్లాడారు. చదువుకున్న యువత, వివిధ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులు రైతులకు తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలనేదే ఈ ఏరువాక–రైతు బిడ్డల పొలం బాట ఉద్దేశం అని వివరించారు. మంగళి తండాలో ప్రధానంగా 650 ఎకరాలలో 200లకుపైగా గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కానీ, వారికి ఎలాంటి భూమి పాసుపుస్తకాలు, రెవెన్యూ రికార్డులలో పేరు నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అమిన్‌సింగ్‌, వ్యవసాయ అధికారి దంతాల దివ్య, లిప్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీవన్‌రెడ్డి, సభ్యులు ప్రవీణ్‌రెడ్డి, రవి, ఆదర్శ రైతు సంఘం అధ్యక్షులు లింగయ్య యాదవ్‌, కోటేశ్వరరావు, కమ్యూనిటీ సర్వే ముత్తయ్య, గ్రామ సర్పంచ్‌ శ్రీదేవికృష్ణానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు భూమి సునీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement