ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలి

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

పెన్‌పహాడ్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఉమర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్‌, జంగంపడిగ, నాగులపహాడ్‌, నారాయణగూడెం, అన్నారం, అనంతారం, పొట్లపహాడ్‌ గ్రామాల్లోని పాఠశాలల్లో డీటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. న్యాయమైన డిమాండ్ల కోసం గతంలో సమ్మె చేసిన కేజీబీవీ టీచర్ల పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గురుకుల, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లెద్దు నరేందర్‌, గంటపంగు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎ.గణిత, జి. ఆనంద్‌ భాస్కర్‌, చర్లపల్లి వెంకటయ్య పాల్గొన్నారు.

ఫ డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఉమర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement