గడ్డి కొరతను అధిగమించేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

గడ్డి కొరతను అధిగమించేలా చర్యలు

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

కోదాడరూరల్‌ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతులు పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ బోడెపూడి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో నియోజకవర్గ పశువైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడి రైతులు ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న గడ్డి నిల్వలను దృష్టిలో పెట్టుకొని, రానున్న ఆరు నెలల వరకు కావాల్సిన గడ్డిని సమకూర్చునేందుకు సిద్ధం కావాలన్నారు. రైతులు తమకున్న భూమిలో కొద్దిమేర గడ్డి విత్తనాలను సాగు చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులకు కావాల్సిన గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో పశువైద్యాధికారులు డాక్టర్‌ పెంటయ్య, ఉషారాణి, వీరారెడ్డి, రవికుమార్‌, అఖిల, మధు, హరిత, సురేష్‌, సురేంద్ర పాల్గొన్నారు.

ఫ జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement