అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్‌స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు.
పుస్తకంలో సమాజాన్ని మార్చే శక్తి
సూర్యాపేటటౌన్ : పుస్తకం అమ్మ వంటిదని, సమాజాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చే శక్తి దానికి ఉందని ప్రొఫెసర్ బెల్లి యాదయ్య కొనియాడారు. కవి, రచయిత డాక్టర్ మెంతబోయిన సైదులు రచించిన ‘కోటి రతనాల సాహిత్య వీణ’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పుస్తకం.. నేటి యువతను ప్రభావితం చేస్తుందని, వర్ధమాన కవి రచయితలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందించారు. అంతకు ముందు ప్రొఫెసర్ దాశరథుల నర్సయ్యతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పున్నయ్య, మనం వికాస వేదిక అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ హసేన్, తుంగతుర్తి సాహితీ వేదిక అధ్యక్షుడు గుండగాని శ్రీనివాస్, సీహెచ్ రామలింగారెడ్డి, డాక్టర్ రజిని, రాచకొండ ప్రభాకర్, మెంతబోయిన సింహాద్రి, మేడల రమేష్, మట్టపల్లి శ్రీశైలం, రామ్మూర్తి పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహునికి
విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అర్చకులు స్వామివారికి విశేషపూజలు, నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచా ర్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.


