కోదాడ: తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం కోదాడ బస్టాండ్ సెంటర్‌లో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, ప్రజా సమస్యలపై విమర్శలు, చర్చలు జరగడం సహజమన్నారు. అలాంటి వాటికి దీటుగా స్పందించాల్సింది పోయి సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌కే. నయీం, చీమ నరేష్, కక్కడపు బాబు, చలిగంటి వెంకట్, పిట్టల భాగ్యమ్మ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం


