ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగుల గరిష్ఠ విస్తీర్ణానికి పరిమితమైనప్పటికీ స్లాబ్ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. దాంతో కొందరు లబ్ధిదారులు స్లాబ్ ఏరియాను వెయ్యి నుంచి 1200 చదరపు అడుగుల వరకు నిర్మిస్తున్నారు. విశాలంగా ఉండాలని, తలుపులు, కిటికీలు తడవకుండా ఉండేలా ఈ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. మరికొందరు మేసీ్త్రలు స్లాబ్ ఏరియా ఎక్కువగా ఉంటేనే ఇంటికి రక్షణ ఉంటుందని చెప్పడంతో లబ్ధిదారులు కూడా అలానే నిర్మించుకుంటున్నారు. దాంతో ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు సరిపోక లబ్ధిదారులు ఇళ్లను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడం, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఇళ్ల పైకప్పు విషయంలో నిబంధనలు తీసుకొచ్చింది. దాంతో లబ్ధిదారులపై ఆర్ధిక భారం తగ్గనుంది.
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఇంటి పైకప్పు విస్తీర్ణానికి గరిష్ట పరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి, గరిష్టంగా 750 చదరపు అడుగుల మించి స్లాబ్ నిర్మించవద్దని నిబంధనల్లో పేర్కొంది. ఇంతకు మించి నిర్మిస్తే బిల్లులు నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులు స్లాబ్ ఏరియా పెంచుకోవడంతో ఖర్చు అధికంగా వస్తుందన్న సమాచారంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మొదట్లో ప్లింత్ ఏరియాకు..!
సూర్యాపేట జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 12,868 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిల్లో ఇప్పటికే 2వేల ఇళ్ల వరకు నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలయ్యాయి. మరో 5500 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో విడత ఇళ్లను సైతం ఇటీవల ప్రకటించినప్పటికీ అర్హుల ఎంపిక జరగలేదు. కేవలం పూరి గుడిసెల సర్వే మాత్రమే చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించిన సమయంలో 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే ఇళ్లను నిర్మించాలని చెప్పారు. అయితే ఈ ఇళ్లు చిన్నగా ఉంటాయని, రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన లబ్ధిదారులు నిర్మాణానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకొని నిర్మించిన ఇళ్లను చూసి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టారు.
ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధన
ఫ ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే
బిల్లుల నిలిపివేత
ఫ లబ్ధిదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం
ఫ రూఫ్ లెవల్‌లో ఉన్న
ప్రతి ఇంటికి వర్తింపు


