మఠంపల్లి : ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి సారూ.. అంటూ నిరుపేద ఒంటరి మహిళ వేడుకుంటోంది. వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామాన్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పైలట్ గ్రామంగా ఎంపిక చేసింది. జాబితాలో గ్రామానికి చెందిన మహిళ షేక్‌మౌలాబి పేరు రాలేదు. దీంతో సదరు మహిళ తాను నివసిస్తున్న రేకుల కప్పు ఇల్లు వర్షం వస్తే కురుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. చేతులెత్తి మొక్కుతున్నా కలెక్టర్ సార్.. తనకు ఇల్లు మంజూరు చేయండి అంటూ ఆదివారం విలేకరుల ఎదుట తన గూడు గోడు వినిపించింది.
ఫ రఘునాథపాలెంలో నిరుపేద
ఒంటరి మహిళ వేడుకోలు


