కాస్త ఎక్కువే కురిసింది | - | Sakshi
Sakshi News home page

కాస్త ఎక్కువే కురిసింది

Jul 7 2026 2:13 AM | Updated on Jul 7 2026 2:13 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జూన్‌లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం సరిపోను వర్షాలు కురిశాయి. జిల్లాలోని ఒకటి రెండు మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో కురిసిన వర్షాలు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా మారాయి. దాంతో అంచనాలకు మేరకు పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

120.3 మి.మీ వర్షపాతం

సూర్యాపేట జిల్లాలో జూన్‌లో సాధారణంగా 95.5 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 120.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. చింతలపాలెం మండలంలో 80.4 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 42.4 మి.మీ మాత్రమే కురిసింది. సూర్యాపేట మండలంలో 107.7 మి.మీలకు 94.7 మి.మీ, మునగాల మండలంలో 103.3 మి.మీలకు 96.1, పాలకవీడు మండలంలో 88.4 మి.మీ. కురవాల్సి ఉండగా 64.8 మాత్రమే కురిసింది. మిగతా మండలాల్లో మాత్రం కురవాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే కురవడంతో రైతులు మెట్ట పంటల సాగును ముమ్మరం చేశారు.

గతేడాది కన్నా అధికమే..

జూన్‌లో నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాక ఏడాది మంచి వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. గతేడాది జూన్‌లో సాధారణం కంటే తక్కువే కురిసింది. గతేడాది జూన్‌లో సగటున కేవలం 53.2 మి.మీటర్ల వర్షపాతమే కురియగా.. ఈ సంవత్సరం జూన్‌లో మాత్రం 120.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

జూన్‌లో కురిసిన వర్షపాతం (మి.మీ)

మండలం కురవాల్సింది కురిసింది

నాగారం 121 157.7

తిరుమలగిరి 121.4 130.9

తుంగతుర్తి 122.7 221.5

మద్దిరాల 106.9 175.2

నూతనకల్‌ 103.1 179.4

జాజిరెడ్డిగూడెం 112.2 175.2

సూర్యాపేట 107.7 94.7

ఆత్మకూర్‌ (ఎస్‌) 97.8 105.3

మోతె 66.3 108.7

చివ్వెంల 85 92

పెన్‌పహాడ్‌ 87.6 97.6

మునగాల 103.3 96.1

నడిగూడెం 95.8 94.3

అనంతగిరి 91 151

కోదాడ 94.6 106.2

చిలుకూరు 87.5 106.2

గరిడేపల్లి 89.4 102.7

నేరేడుచర్ల 86.8 87.1

పాలకీడు 88.4 64.8

మఠంపల్లి 68.8 168.9

హుజూర్‌నగర్‌ 93.7 122.2

మేళ్లచెర్వు 84.4 89.7

చింతలపాలెం 80.4 42.4

సరాసరి 95.5 120.3

జూన్‌లో సాధారణానికి మించి వర్షాలు

సగటున 95.5 మి.మీటర్లకు..

120.3 మి.మీ నమోదు

మెట్ట పంటలకు అనుకూలం

ఇప్పటికే అంచనాల మేరకు పత్తి సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement