చివ్వెంల మండలానికి చెందిన గుగులోతు కృష్ణ, మోతె మండలం మేకపాటి తండాకు చెందిన బానోత్ శంకర్ దివ్యాంగులు. తమకు ట్రై సైకిల్ ఇవ్వాలని కోరుతూ నాలుగు నెలల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలోనూ వినతిపత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు వారి సమస్య పరిష్కారం కాక పోవడంతో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి మళ్లీ అధికారులకు సమస్యను విన్నవించుకున్నారు. త్వరితగతిన మూడు చక్రాల వాహనాలు అందించాలని కోరుతున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట


