నులిపురుగుల నివారణకు ‘ఆల్బెండజోల్‌’ | - | Sakshi
Sakshi News home page

నులిపురుగుల నివారణకు ‘ఆల్బెండజోల్‌’

Jul 14 2026 6:10 AM | Updated on Jul 14 2026 6:10 AM

సూర్యాపేటటౌన్‌ : పిల్లల్లో అనారోగ్యానికి కారణమైన నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు అందిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. సూర్యాపేట మండలం బాలెంలలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో నులి పురుగుల నిర్మూలనలో భాగంగా ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంవత్సరం నుంచి 19 ఏళ్లలోపు వారందరూ మాత్రలు వేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో సంబంధిత ఉపాధ్యాయులతో, బడిబయట పిల్లలకు ఆశా కార్యకర్తలతో మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మాత్రలు పొందని వారికి ఈ నెల 20న అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ నీలా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ కోటిరత్నం, డాక్టర్లు ప్రసిద్ద్‌, నాజియా తబస్సుమ్‌, స్రవంతి పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement